Rythu bandhu scheme : రైతుబంధు పై కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన సర్కార్ ..
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ తీసుకువచ్చిన రైతు భరోసా స్కీమ్ లో కీలక మార్పులు చేసేందుకు సర్కార్ రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు నిబంధనలు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. సాగు చేసే భూమిపై రైతుబంధు ఇవ్వటం సహా రాష్ట్రంలో నివాసం ఉండే వారికి మాత్రమే స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు,రాళ్లు, రప్పలు, గుట్టలకు కేసీఆర్ సర్కార్ రైతుబంధు సాయం ఇస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ తో పాటు వివిధ పార్టీ నేతలు విమర్శలు చేశారు. గతంలో భూమి ఉంటే చాలు ఓనర్ ఎక్కడున్నా రైతుబంధు సాయం ప్రభుత్వం అందించేది. ఇప్పుడు ఆ నిబంధనలు కూడా మార్చనుంది ప్రభుత్వం.
ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి,టాక్స్ కట్టే వారికి రైతుబంధు తొలగించాలన్న ప్రతిపాదనపైన చర్చ సాగుతుంది. అతి త్వరలోనే ఈ అంశంపై కూడా నిబంధనలు విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10వేలు అందించగా కాంగ్రెస్ మాత్రం ఎకరాకు ఏటా 15వేలు అందిస్తానని హామీ ఇచ్చింది. అదే విధంగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు.
రైతుబంధు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వాలు పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు ఇస్తున్నట్లుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాల పనిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో అర్హులైన నిరుపేదలకు రైతుబంధు, పెట్టుబడి సహాయం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచే రైతుబంధును 5 ఎకరాల పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, ఆ మేరకే విధివిధానాలు సిద్ధం చేస్తుంది. రైతు బంధు 5 ఎకరాల పరిమితి విధిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటికి బలాన్ని చేకూర్చాయి.
దీంతో కేవలం 5 ఎకరాలు స్థలం ఉన్నవారికి మాత్రమే అది కూడా సాగు చేసే భూమికి మాత్రమే ఇవ్వాలని విధి విధానాలు తయారు చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు వ్యవసాయం పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివర్లో పంట సాయం అందించే ఆలోచన చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే 5ఎకరాల వరకు రైతు భరోసా నగదు అన్నదాతల అకౌంట్లో వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా జమ చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ నడవడం వల్ల ఎలక్షన్స్ పూర్తి అయిన వెంటనే రైతుబంధు కు సంబంధించిన కొత్త విధి విధానాలను ప్రకటిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది..