డాక్టర్ హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది ఫలితాల్లో మెరిసిన గ్రామీణ విద్యార్థులకు ఘనంగా సన్మానం


*ట్రస్ట్ చైర్మన్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..*
విద్య అనేది మానవ జీవితంలో మార్పును తీసుకురాగల సాధనం. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు లేకపోయినా, వారు చూపించే పట్టుదల ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అటువంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు మార్గదర్శనం చేయడమే మా లక్ష్యం.ఈ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మెరుగైన విద్యా అవకాశాలు, ఆరోగ్య సేవలు అందించేందుకు మేము కృషి చేస్తాము..
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు,ట్రోఫీలు, నగదు బహుమతులు అందించబడినాయి. ఈవెంట్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు కన్నీళ్లతో తమ పిల్లల విజయాన్ని చూసి ముచ్చటపడ్డారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ విద్యార్థులు కూడా కార్యక్రమానికి హాజరై, వారి అభినందనలు తెలిపారు..
పరిసర గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ కార్యక్రమం ఒక పెద్ద వేదికగా నిలిచింది. ముఖ్యంగా ప్రథమ స్థానం సాధించిన విద్యార్థుల పేర్లను స్టేజిపై ప్రకటించి, అందరినీ అలరించారు. విద్యార్థుల విజయ గాథలు విన్న ప్రేక్షకులు చప్పట్లతో వారిని గౌరవించారు.
ఈ కార్యక్రమం చివరలో,ట్రస్ట్ వాలంటీర్లు సమాజంలో విద్యాభివృద్ధికి తమ భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాల పట్ల తమ కట్టుబాటును తెలియజేశారు..